నవతెలంగాణ -ప్రకాశం: యర్రగొండపాలెంలో ఏప్రిల్ 21న జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త రాజయ్య మృతి చెందాడని పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ గూండాల దాడిలో రాజయ్య తీవ్రంగా గాయపడ్డాడని, రాజయ్యను బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను కలచివేసిందని తెలిపారు. దశాబ్దాలుగా ఎంతో నిబద్ధతతో పార్టీకి సేవలందిస్తున్న కార్యకర్తను పోగొట్టుకోవడం బాధాకరం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, రాజయ్య కుటుంబానికి పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.