– శనివారం జరిగిన సంఘటన..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ లో వివేకానంద ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుంకేపాక సాత్విక్(15) అనే విద్యార్థి పై మ్యాథ్స్ సార్ ఆంజనేయులు దండించిన సంఘటన సోమవారం విద్యార్థి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. విద్యార్థికి మెడ చుట్టూ చేతు వేళ్ళు, చేతి గోర్లు, వీపులో పిడిగుద్దులు గుద్దినట్లు ఆనవాళ్లను విలేకరులకు, పోలీసులకు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. సాత్విక్ ముందటి బెంచ్ పై కాలు పెట్టి కూర్చున్నాడని మ్యాథ్స్ సార్ అంజయ్య తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ కు తెలియజేసిన వారి నుండి ఎలాంటి సమాధానం, నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. విద్యార్థులు ఏదైనా తప్పు పని చేస్తే తల్లిదండ్రులకు చెప్పాలి కానీ వీళ్ళు తీవ్రంగా గాయపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆంజనేయులు పై స్కూల్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ, డీఈవో, పోలీసులను కోరారు. శనివారం రోజున జరిగిన సంఘటన పై విద్యార్థి సాత్విక్ మేనమామ మిర్యాల సంతోష్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.టీచర్ ల ప్రెస్ స్టేషన్ విద్యార్థులపై చూపించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుల కోసం,విద్యార్థుల భవిష్యత్తు కోసం వేల రూపాయలు వెచ్చించి స్కూలుకు పంపేది ఇలా దెబ్బలు పడడానికా అని స్కూల్ యజమాన్యంపై మండిపడ్డారు. ప్రైవేటు స్కూల్లో జరిగిన విషయాన్ని డీఈవో రమేష్ కుమారు వివరణ కోరగా విద్యార్థి పై జరిగిన దాడి తన దృష్టికి వచ్చిందని, విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాఠశాల యజమానియాలతో తో పాటు ఉపాధ్యాయుడు ఆంజనేయులుపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.