నవతెలంగాణ -కొత్తగూడ: తన విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజారిగా మారాడు ఓ ఉపాధ్యాయుడు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం వేలుబెల్లి గ్రామపంచాయతీ పరిధి దొరవారి వేంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సువర్ణపాక కృష్ణ సెలవు రోజు అయినప్పటికీ వినాయక చవితి రోజున పాఠశాలకు వచ్చి తన విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంలో భాగంగా నాలుగవ తరగతి లోని తెలుగు సబ్జెక్టులోని వినాయక చవితి పాఠం ఆధారంగా విద్యార్థులకు అర్థవంతమైన బోధనను అందించారు. అంతేకాకుండా వినాయక చవితి పండగ రోజున వినాయక చవితి పాఠం చెప్పి విద్యార్థులకు వినాయక చరిత్రతో పాటు సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించారు.