నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మొరం రాళ్లు మోయించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో వర్షం నీళ్లు నిలబడుతూ ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక ఎస్సై యాదగిరి గౌడ్ దృష్టికి ఉపాధ్యాయులు తీసుకురావడంతో పది ట్రిప్పుల మొరంను పాఠశాల ఆవరణలో పోయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా పాఠశాల పిఈటి, ఉపాధ్యాయుడు జేదిద్యలు బ్లెడ్ ట్రాక్టర్ తో ఆవరణలో చదును చేయించారు. కాగా మొరంలో పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో విద్యార్థులతో మోయించారు. పాఠశాల ఎదుటే బస్టాండ్ ఉండడంతో స్థానికులు, ప్రయాణికులు చూసి విద్యార్థులతో ఉపాధ్యాయులు దగ్గరుండి రాళ్లు మోయించడమేంటని ప్రశ్నించుకుంటున్నారు.