ఘనంగా స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ లో ఉపాధ్యాయుల దినోత్సవం

– ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పి చైర్మన్, జిల్లా సంక్షేమ అధికారి

నవతెలంగాణ కంటేశ్వర్
స్థానిక మారుతినగర్ తిసి స్నేహ సొసైటీఫర్ – రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా పరిషత్ చైరన్ దాదన్నగారి విఠల్ రావ్ పాల్గొన్నారు. మొదట సర్వేపల్లి రాధకృష్ణన్ చిత్రపటానికి పూల మాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు మాట్లాడుతూ.. శిశువుకు జన్మనిచ్చి ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ అయితే పాలించి వారి ఎదుగుదలకు ప్రోత్సహానిచ్చేది తండ్రి అయితే వ్యక్తికి జ్ఞానాన్ని భోదించేది ఉపాధ్యాయుడు అని ఉపాద్యాయునికి ఈ విశిష్టత మైన స్థానం ఉందని తెల్పారు… ఆ జ్ఞానం అనే చీకటిని పారద్రోలి, విద్యా అనే విజ్ఞానాన్ని అందించే వారే గురువు. గురువుల ప్రాభావంతోనే నేడు ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగులు, రాజకీయ నాయకులు, అందరూ మంచి స్థాయికి చేరుకోగలిగారు అని తెలియజేశారు. వికలాంగులు, దేవుని బిడ్డలు అని నేటి సమాజంలో దివ్యాంగులు కూడా ఎన్ని ఉన్నత శిఖరాలను అదిరోహించగల్గుతున్నారని వారికి గురువులు పెద్దలు, తల్లిదండ్రుల దీవెనలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం 4016 రూపాయల, ఫించన్ అందిస్తూ వారికి తోడ్పాటు అందిస్తుందని తెల్పరు. అదేవిధంగా గురుకుల పాఠశాల ద్వారా ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తుందని తెల్పరు. విద్యార్థులు అందరం మంచిగా చదువుకోని జ్ఞానాన్ని పొందాలి అని అన్నారు.ఈ కార్యక్రమునికి గౌరవ అతిధిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి గౌరవ అతిధిగా విచ్చేసి మాట్లాడారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన గురువులు తనకు అందించిన విద్యా బుద్దులతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని తన గురువుల తన చదువుకున్న పాఠశాలకు ఆమె దన్యవాదాలు తెలియజేసారు. దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు విద్యాబుద్ధులు బోధిస్తున్నా ఉపాధ్యాయులు అందరికి ఈ సందర్భంగా దన్యవాదాలు తెల్పారు.
     ఈ కార్యక్రమములో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అయి శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ కాలనీ హై స్కూల్, హాజరే జ్యోతి ఉపాధ్యాయురాలు బిర్లాం హైస్కూల్, ఏ. బాల్రాజు ఉపాద్యాయ దుబ్బ హైస్కూల్, సరసిజ ఉపాధ్యాయురాలు మానిక్ బండార్ తెసు పి. రమేష్ ఉపాద్యాయుడు పోలీస్ లైన్ పాఠశాల, స్నేహ సొసైటీ రీకాన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, యన్. వెంకటలక్ష్మి ఉపాధ్యాయురాలు మానసిక వికలాంగుల పాఠశాల జి. సుధ ఉపాద్యాయురాలు, వై. రాజశ్రీ ఉపాద్యాయురాలు అందు ప్రత్యేక పాఠశాల ఉపాద్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమములో మానసిక వికలాంగ విద్యార్థులు, అంధవిద్యార్థ వారి వారి టీచర్లను అనుకరించి ఉపాద్యాయులను గౌరవించారు. ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో స్నేహ సోసైటీ కార్యదర్శి, యస్.సిద్దయ్య, వైస్ రాజేశ్వరి, తెలంగాణ శంకర్, మానసిక వికలాంగుల పాఠశాల విద్యా సిబ్బంది అందుల పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love