విజయ్ హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

నవతెలంగాణ- కంఠేశ్వర్
డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయ్ -హైస్కూల్ విద్యార్థినీ ఉపాధ్యాయ బృందం 05-09-2023 (మంగళవారం) రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గత 15 సంవత్సరాలుగా తమ సేవలను అందిస్తున్న ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయునులైన అరుణ్జ్యోతి, యస్.సుజాతలను స్కూల్ యాజమాన్యంవారు ఘనంగా సన్మానించారు.అనంతరం 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు ‘ఉపాధ్యాయులు’గా వ్యవహరించి స్కూల్ విద్యార్థులను అలరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయబృందాన్ని విజయ్ హైస్కూల్ వ్యవస్థాపకులు డా. అమృతలత అభినందించారు.
Spread the love