నవతెలంగాణ – సిద్దిపేట
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని టీచర్స్ డే సెలబ్రేషన్స్ స్థానిక వైశ్య భవనంలో అత్యంత వైభవంగా వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 15 మంది ఉపాధ్యాయులను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి , జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గంప శ్రీనివాస్, కొర్తివాడ రాజేందర్ లు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని, దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉంటుందని, ఒక సైంటిస్ట్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా ఎలాంటి గొప్ప వ్యక్తులనైన తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు. వాసవి క్లబ్ అధ్యక్షుడు చింత రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సిద్దిపేట వాసవి క్లబ్ ద్వారా 8 నెలలో సుమారు 350 వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. టీచర్లు కల్లెపల్లి శ్రీనివాస్ (డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్), నాగేందర్ (అల్లిపూర్), ఉమారాణి (కొండపాక), భవాని (నాగపురి), నరసింహ రెడ్డి (అందె), వెంకట్ సురేష్ కుమార్ (రామంచ), వసంత (చిన్నకోడూరు), మహేందర్ (చర్ల అంకిరెడ్డిపల్లి), రవి కిరణ్ (ఎల్లారెడ్డిపేట), అజయ్ కుమార్ (అందె), రవీందర్ రెడ్డి (హబ్సిపూర్), సుధాకర్ (గణపురం), నగేష్ (ఏటిగడ్డ కృష్ణాపూర్), రవీందర్ (గోనేపల్లి) ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ గంప కృష్ణమూర్తి, యాద శ్రీనివాస్, రీజియన్ చైర్మన్ పుల్లూరి శివకుమార్, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తొడుపునూరి కృష్ణవేణి, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు అర్వపల్లి హరి కిరణ్, కార్యదర్శి చకిలం రవి, కోశాధికారి బూరుగు వేణుగోపాల్, తిమ్మిశెట్టి విజయలక్ష్మి, పీఆర్వో అయిత శంకర్, మాజీ అధ్యక్షులు జైన సత్యం, లింగ శ్రీనివాస్, సముద్రాల శ్రీనివాస్, బుక్క శివ, ఉప్పల రమేష్ గారు, కొండూరు సతీష్, తదితరులు పాల్గొన్నారు.