ప్రపంచానికి గొప్ప మేధావులను అందిచగల శక్తి ఉపాధ్యాయులకే ఉంది.

ప్రపంచానికి గొప్ప మేధావులను అందిచగల శక్తి ఉపాధ్యాయులకే ఉంది.ఉపాధ్యాయులను శాలువ, షీల్డ్స్ తో సన్మానించిన
– ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్
నవతెలంగాణ -పెదవూర
ప్రపంచానికి గొప్ప మేధావులను అందించగల శక్తి ఉపాధ్యాయుల కే ఉంటుందని ఏ కే పౌండేషన్ ఛైర్మెన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కట్టేబోయిన అనిల్ కుమార్ అన్నారు. శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం చిల్కాపురం గ్రామంలో పాఠశాల సిబ్బంది ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడారు. చిల్కాపురం గ్రామ పాఠశాల లో పది సంవత్సరాలు పైగా సేవలు అందించి పాఠశాల అభివృద్ధి కి బాటలు వేసి,విద్యార్థులని అన్ని రంగాలలో ప్రవీణం కనబర్చేలా తీర్చిదిద్ది, విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో గొప్ప స్థానని సంపాదించారని అన్నారు. గ్రామ పేరుని రాష్ట్ర స్థాయిలో నిలిపి జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు సొంతంచేసుకున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రధానోపాధ్యాయిలు కట్టెబోయిన సైదులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆకారపు శివ ప్రసాద్,సేవలను కొనియాడారు. అదే విధంగా సంవత్సరం క్రితం నుండి అకింతభావం తో పనిచేసిన ఉపాధ్యాయురాలు శీరీష సేవలను అభినందిచారు. పాఠశాల లో ఉపాధ్యాయులగా అంకితభావం తో పనిచేస్తున్న సైదులు పాఠశాల విద్యావాలంటరీలు కల్పన, వసంతల సేవలను అభినందించారు.ఉపాధ్యాయ వృత్తి మాత్రమే దేశానికి గొప్ప మేధా సంపదన అందించగల శక్తి ఉందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బాబురావు నాయక్, మాజీ సర్పంచ్ తుడుం రమణ ముత్తయ్య, ఎంఈఓ తరి రాము, నోడల్ అధికారి శ్రీనివాస్, పల్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రాంరెడ్డి, ప్రధానోపాధ్యాయులు రామాచారి, సీతరాం,రాజేష్, గ్రామ వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love