విద్యార్థి వర్షిని కుటుంబానికి ఉపాధ్యాయులు ఆర్థిక సహాయం.

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన కడారి వెంకటేష్ రమ దంపతుల కుమార్తె వర్షిని బుధవారం తెల్లవారుజామున పాముకాటుతో మృతి చెందడం జరిగింది. విద్యార్థి వర్షిని మండల కేంద్రంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతోంది. వర్షిని కుటుంబాన్ని పాఠశాల ఉపాధ్యాయులు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. పేద కుటుంబమైన వర్షిని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు 3500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. విద్యార్థి వర్షిని ఆత్మకు శాంతి చేకూరాలని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాఠశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి హెచ్ స్ మరియు ఎంపీపీఎస్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కే జ్యోతి, లావణ్య, కె రఘురాం, వై కన్నయ్య, బి సూర్య, కే రమేష్, ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love