విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి 

Teachers should work for the educational development of students– ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ సమావేశం
– అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ బొల్లం అనిత 
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని రామన్నగూడెం ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆ  పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ బొల్లం అనిత అన్నారు. శనివారం ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటగా పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన వసతులపై చర్చించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నడిపించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల తల్లిదండ్రులం కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి పై ఉపాధ్యాయ బృందం ప్రత్యేక దృష్టి సారించి వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాసులు తీసుకొని వారి విద్యా పట్ల ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేసి ఉపాధ్యాయ బృందం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నంత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని కోరుతున్నామని అన్నారు. కన్న తల్లిదండ్రులకు పాటలు బోధించిన గురువులకు పేరు ప్రఖ్యాతలు ఉండే విధంగా విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో ప్రతి సబ్జెక్టును చదివి ఉన్నంత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సోమయ్య, తల్లిదండ్రులు చీకటి జగదీష్ గౌడ్, దొమ్మాటి భాస్కరాచారి, మల్యాల అశోక్, కొల్లూరు లావణ్య, గుండ బిక్షం, స్వప్న ,పద్మ, ఉపాధ్యాయులు బుచ్చిరామయ్య వెంకటేశ్వర్లు యాదగిరి  రమేష్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love