విశాఖలో టీమిండియా-ఆసీస్ టీ20.. ప్రారంభమైన టికెట్ల అమ్మకం

నవతెలంగాణ – విశాఖ: ఈ నెల 23న విశాఖలోని మధురవాడ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం నేడు ఆఫ్ లైన్ విధానంలో టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఈ ఉదయం 10 గంటల నుంచి టికెట్ల అమ్మకం షురూ చేశారు. మధురవాడ స్టేడియంతో పాటు మున్సిపల్ స్టేడియం, గాజువాక ఇండోర్ స్టేడియంలోనూ టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. రూ.600, రూ.1500, రూ.2000, రూ.3000, రూ.3500 ధరల శ్రేణిలో టికెట్ల విక్రయాలు చేపట్టారు. వరల్డ్ కప్ ముగిశాక టీమిండియా, ఆసీస్ మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లోని తొలి మ్యాచ్ కు విశాఖ ఆతిథ్యమిస్తోంది. నవంబరు 23 నుంచి డిసెంబరు 3 వరకు సిరీస్ జరగనుంది.

Spread the love