మూడో టీ20 కోసం హైదరాబాద్ చేరుకున్న టీమిండియా, బంగ్లాదేశ్

నవతెలంగాణ – హైదరాబాద్: ఉప్పల్ వేదికగా శనివారం భారత్ – బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రెండు జట్ల క్రీడాకారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న భారత్, బంగ్లాదేశ్ జట్ల సభ్యులకు నోవాటెల్, తాజ్ కృష్ణ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు. కాగా, భారత్, బంగ్లాదేశ్ జట్ల క్రీడాకారులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఓ వైపు శనివారం దసరా పండుగ, మరో పక్క ఉప్పల్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ ఉండటంతో క్రికెట్ అభిమానులు సంతోషంతో మునిగితేలుతున్నారు.  ఇప్పటికే మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా టీమిండియా రెండు టీ 20 మ్యాచ్‌లు గెలిచి సిరీస్ ను 2-0తో సొంతం చేసుకోగా, ఉప్పల్‌లో నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. అయితే, చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో మ్యాచ్‌ను తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) ఉప్పల్ స్టేడియంలో ఇండియా, బంగ్లాదేశ్ జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి.

Spread the love