టాస్ ఓడిన టీమిండియా

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నేడు చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒక మార్పు చేసింది. దీపక్ చహర్ స్థానంలో యువ పేసర్ అర్షదీప్ సింగ్ కు స్థానం కల్పించారు. ఇక, ఆసీస్ జట్టులో క్రిస్ గ్రీన్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే ఈ సిరీస్ ను టీమిండియా 3-1తో చేజిక్కించుకున్న నేపథ్యంలో నేటి మ్యాచ్ కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.

Spread the love