టీమ్‌ఇండియా వెస్టిండీస్‌ టూర్‌ షెడ్యూల్ విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్
ఈ ఏడాది జులై-ఆగస్టులో టీమ్‌ఇండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. విండీస్‌తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం రాత్రి విడుదల చేసింది. జులై 12-16 తేదీల మధ్య డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు, జూలై 20-24 మధ్య ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో రెండో టెస్టు జరగనుంది. జులై 27- ఆగస్టు 1 మధ్య మూడు వన్డేల సిరీస్‌ను నిర్వహించనున్నారు. ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Spread the love