తొలి వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

నవతెలంగాణ – హైదరాబాద్ : సొంత‌గ‌డ్డ‌పై భార‌త మహిళ‌ల‌ జ‌ట్టు గ‌ర్జించింది. ఏక‌ప‌క్షంగా సాగిన‌ తొలి వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా పై జ‌య‌భేరి మోగించింది. తొలి వ‌న్డేలో ఓపెన‌ర్ స్మృతి మంధాన(117) సూప‌ర్ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా.. స్పిన్న‌ర్ ఆశా శోభ‌న‌(4/21) తిప్పేసింది. భారీ ఛేద‌న‌లో మిగ‌తా బౌల‌ర్లు తలొక చేయి వేయ‌డంతో ప్ర‌త్య‌ర్థిని 122 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. దాంతో, చిన్నస్వామి స్టేడియంలో స‌ఫారీల‌పై టీమిండియా 143 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యం న‌మోదు చేసింది. ఈ విజ‌యంతో హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన మూడు వ‌న్డేల‌ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Spread the love