ఆస్ట్రేలియాపై టీమిండియా ఓటమి

నవతెలంగాణ – హైదరాబాద్: మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా ఎ జట్టుతో జరిగిన రెండో అనధికార టెస్టు మ్యాచ్ లో ఇండియా ఎ ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో ఇండియా ఎపై ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండియా ఎ తొలి ఇన్నింగ్స్ లో 161 పరుగులకే పరిమితం కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది. రెండు ఇన్నింగ్స్ లలోనూ ద్రువ్‌ జురెల్‌(80, 68) ఒక్కడే అర్థశతకాలతో రాణించాడు. మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. కాగా, ఆస్ట్రేలియా ఎ తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులకు ఆలౌటైంది.

Spread the love