హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన కథా నాయకుడు నాని. ఇటీవల విడుదలైన ‘హారు నాన్న’ ఆయనకు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నానీ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో మాస్‌లుక్‌లో నాని మెరిపించ నున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. శనివారం నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయన పాత్రను పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేసింది. ‘కోపాన్ని కూడా ఓ పద్ధతిలో చూపించేది నేనే. నా పేరు సూర్య. కోపం చూపించడానికి ఆ ఒక్క రోజు చాలు’ అంటూ నాని మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.