యూనివర్సిటీ లో తీజ్ పండుగ వేడుకలు..

Teej festival celebrations in the university..నవతెలంగాణ – డిచ్ పల్లి
బంజారాల తీజ్ పండుగను తెలంగాణ యూనివర్సిటీ లో ప్రారంభించడం జరిగిందని, ఈ పండుగ విశిష్టత బంజారాలో అమ్మాయిలకు మంచి వరుడు కావాలని ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి పాల్గొని మాట్లాడుతూ బంజారాల సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలని, ముందు తరాలకు  ఈ సాంప్రదాయాలను కొనసాగించాలన్నారు. ప్రొఫెసర్ శాంతాదేవి మాట్లాడుతూ యూనివర్సిటీలో తీజ్ పండుగను నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ప్రొఫెసర్ కిరణ్ రాథోడ్ మాట్లాడుతూ తీజ్ పండుగ సంస్కృతి సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీలో ఈ సాంప్రదాయాలను కొనసాగించాలని కోరారు.తెలంగాణ యూనివర్సిటీలో బంజారాల తీజ్ పండుగను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీను రాథోడ్ అద్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన విద్యార్థినిలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సాగర్ నాయక్, శ్రీను నాయక్ ,శ్రీకాంత్, సంజయ్, లక్ష్మణ్, రతన్, మోహన్ నాయక్, చందర్ నాయక్, జ్యోతి, కవిత తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love