ఇసుక వేలంపాట నిర్వహించిన తహసిల్దారు

నవ తెలంగాణ: రెంజల్

రెంజల్ తాసిల్దార్ కార్యాలయంలో అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొన్న ఇసుక డంపులను గురువారం వేలంపాట నిర్వహించారు. వేలం పాటలో పాల్గొన్న ముగ్గురి నుంచి రూ. 5 వేల రూపాయలు డిపాజిట్ ను తీసుకొని వేలంపాట నిర్వహించగా, నవీపేట్ మండలం యంచ గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు రూ.10 వేల ఐదువందల రూపాయలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో స్థానికులు అన్సార్, ఆర్. జనార్దన్ రెడ్డి, గంగా గౌడ్, సీనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు
Spread the love