తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,– కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌, రామన్న మాదిగ
నవతెలంగాణ-దోమ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిస్వార్థంగా పోరాడిన తెలం గాణ ఉద్యమకారులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కారులను అన్నిరకాలుగా ఆ దుకుంటామని కేసీఆర్‌ ప్రభుత్వం 10 ఏండ్లుగా పట్టించుకోలేదనీ, అతి కొందరికి మాత్రమే కొన్ని అవకాశాలు కల్పించారన్నారు. చాలా మంది ఉద్యమకారులను కనీసం కన్నెత్తి చూడలేదని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉద్యమకారులను గుర్తించి, వారిని అన్నివిధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటే వారంతా రేవంత్‌ ప్రభుత్వానికి వెన్నంటి ఉంటారని తెలిపా రు. తెలంగాణ ఉద్యమకారుల చైతన్య వేదిక రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రామన్న మాదిగ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం అ హర్నిశలు పోరాడిన ఉద్యమకారులకు బీఆర్‌ఎస్‌ పాలనలో ఎలాంటి లబ్ది చేకూరలేదన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఉద్య మకారుల విషయం ప్రస్థావించాలని బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో గోవింద రెడ్డి, కాంగ్రెస్‌ పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ పల్లెకృష్ణ, మున్సిపల్‌ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ నాయక్‌, కాంగ్రెస్‌ నా యకులు జి. శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love