నేటి నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

నేటి నుంచి తెలంగాణ సాయుధ
పోరాట వారోత్సవాలు– రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను నేటి నుంచి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటమని గుర్తు చేశారు.ఆ పోరాటం భూ సమస్యలను ఎజెండాగా తీసుకొచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love