నవతెలంగాణ హైదరాబాద్: డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని కోరారు. ఇక శాసనసభ ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో డీజీపీ(హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్-హెచ్వోపీఎఫ్)గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన రవి గుప్తానే కొనసాగించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ఆయన్ని డీజీపీ(సమన్వయం)గా నియమిస్తూ.. డీజీపీ(హెచ్వోపీఎఫ్)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.