తెలంగాణ బాలోత్సవం సమ్మర్ క్యాంపు వచ్చేసిందోచ్..

– మే5 నుండి 20 వరుకు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
నవతెలంగాణ – హైదరాబాద్
గోడల పైన పిచ్చి గీతలు గచ్చులపైన పెన్సిళ్లు పెన్నుల మరకలు గుమ్మం ముందు కేరింతలు ఇలా.. ఈ అల్లరిని, వాళ్ళ సందడిని ఆపాలంటే తల్లిదండ్రులు తలలు పట్టుకోవాల్సిందే.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇల్లు పీకి పందిరేయక మానరుసుమా…! వీరి అల్లరి భారీ నుంచి తప్పించుకోవాలంటే..? చాలామంది తల్లిదండ్రులు ఎంచుకునే పరిష్కారమే సమ్మర్ క్యాంప్. హైదరాబాద్ లో సమ్మర్ క్యాంపు అంటే రూ.10 వేయిల నుండి రూ.20 వరుకు చెల్లించాల్సిందే అండి కానీ….మన ” తెలంగాణ బాలోత్సవం” ఉచిత సమ్మర్ క్యాంపు మే 5 నుండి 20 వరుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైదరాబాద్ అందమైన, విశాలమైన హాలులో ఏకకాలంలో, అటు ఆటలు, ఇటు విజ్ఞానాన్ని అందించి, ఉత్సాహాన్ని ఉల్లాసానందించే..ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం రండి. ఇది పోటీ ప్రపంచం సుమా.. చదువొక్కటే పరిష్కారం కాదు. ఏదైనా కళలలోనూ ..క్రీడలలోనూ.. ప్రావీణ్యత సాధించాలి. ప్రావీణ్యత అంటే…? Extra qualification అదనపు అర్హతగా గుర్తిస్తున్నారు. వేసవి సెలవుల్లో .. కాలాన్ని వృధాగా పోనీయకుండా కొత్త కళలను, సరికొత్త పనిలో ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతున్నారు. ప్రతి పిల్లవాడిలోనూ సృజనాత్మకత దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి వెలికి తీయడమే తెలంగాణ బాలోత్సవం నిరంతరం పిల్లల్లో పనిచేస్తుంది. ఇందులో భాగమె ఉచిత సమ్మర్ క్యాంపుల ముఖ్య ఉద్దేశం. చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని ఫోకస్ చేసి మెరుగుపరిచే విజ్ఞాన క్యాంపు సమ్మర్ క్యాంపు కు త్వరపడండి.
వివరాలకు: భూపతి వెంకటేశ్వర్లు 9490098343 ఎన్ సోమయ్య 9490098676
Spread the love