నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ క్యాబినెట్ సమాశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అద్యక్షతన ఈ సమావేశం ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ క్యాబినెట్ లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పుపై, హైడ్రాకు చట్టబద్దత అంశం, అలాగే 2 లక్షల రుణాల మాఫీ చెల్లింపు, 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఆర్డినెన్సు రైతు భరోసాపై క్యాబినెట్ లో చర్చించనున్నారు. వీటిపై చర్చించి విధి విధానాలపై ఖరారు చేయనున్నారు. క్యాబినేట్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే హైడ్రాపై ప్రజల్లో విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.