జవహర్‌లాల్ నెహ్రూ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళుర్పించారు. నెహ్రూ ఒక దార్శనికుడంటూ ట్విటర్‌లో కొనియాడారు. ‘స్వతంత్ర భారతదేశ భవితకు పునాదులు వేసిన దార్శనికుడు. ప్రజాస్వామ్య ఆకాంక్షల సాధకుడు. పంచవర్ష ప్రణాళికల రూపశిల్పి, భారత తొలి ప్రధాని స్వర్గీయ జవహార్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించాను’ అని పోస్ట్ చేశారు.

Spread the love