తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల తిరుపతిలో మనవడి మొక్క తీర్చుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాసేపటి క్రితం తిరుమలకు చేరుకున్నారు. ముందుగా హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రచనా అతిధి గృహం వద్ద సీఎం రేవంత్‌కు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తన మనవడి పుట్టెంటుకలు స్వామి వారికి రేవంత్ కుటుంబ సభ్యులు సమర్పించనున్నారు. ఈ రాత్రికి తిరుమలో ఆయన బస చేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Spread the love