శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – తిరుమల: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్‌ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

Spread the love