తెలంగాణ సీపీగెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల సీపీగెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మే 12 నుంచి జూన్‌ 11 వరకు ఈ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆలస్య రుసుంతో జూన్‌ 20వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు తాజాగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలను జూన్‌ 30 నుంచి జులై 10వరకు రోజుకు మూడు సెషన్లలో జరుగుతాయని కన్వీనర్‌ వెల్లడించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్‌టీయూహెచ్‌, మహిళా యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర సంప్రదాయ పీజీ కోర్సుల్లో సీపీగెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.

Spread the love