ఘనంగా తెలంగాణ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-నసురుల్లాబాద్ 
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్, నసురుల్లాబాద్ బాన్సువాడ డివిజన్ కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అవతరణ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ ఆర్డీఓ ఆఫీస్, తహశీల్దార్ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం, ఎక్సైజ్ ఆఫీస్, ప్రభుత్వ ఆసుపత్రి, ఎంపిడిఓ కార్యాలయం, ఆర్టీసీ బస్ డిపో తదితరుల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలకు స్థానిక నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం బాస్కర్ రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీర్కూర్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం, ఎపిడిఓ కార్యాలయం పోలీస్ స్టేషన్, గ్రామ పంచాయతీ కార్యాలయం, వ్యవసాయ సహకార సంఘం, మార్కెట్ ఆఫీస్, విద్యాధికార్యాలయం, నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి పాల్త్య విఠల్, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ  రంజిత్ రెడ్డి,  గ్రామ పంచాయతీ లో సర్పంచ్ అరిగే సాయిలు, తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ భవయ్య, ప్రభుత్వం పాఠశాలలో హన్మాండ్లు, రేఖ సొసైటీలో  కొప్పుల గంగారాం, మైలారం, నాచుపల్లి, దుర్కి, సొసైటీలో ఛైర్మన్ లు పెర్క శ్రీనివాస్, సుధీర్ బాబు, డివిడి శ్రీనివాస్ యాదవ్ లు నాచుపల్లి మినీ గురుకుల పాఠశాలలో ప్రియదర్శణీ, అంగన్ వాడి కేంద్రాల్లో ఆరోగ్య కేంద్రాల్లో, గిరిజన గురుకుల పాఠశాలలో వెంకట రమణ తదితరులు జాతీయ జెండాను ఎగురవేశారు.అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు, మైలారం సొసైటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగపలితమే ఈ తెలంగాణ రాష్ట్రం అని ఈ ఏండ్లల్లో ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రం శుభిక్షంగా ఉందన్నారు. గతంలో ఒక రైతు చనిపోతే ఒక రూపాయి వచ్చేది కాదు, రైతు కుటుంబం వీధిన పడేది నేడు కుటుంబ యజమాని లేక పోయిన సగర్వంగా జీవిస్తున్నారని అన్నారు.
Spread the love