తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఎడ్ సెట్ 2024 ఫలితాలు జూన్ 11న విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పలు కాలేజీల్లోని రెండేళ్ల బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు జరిపిన టీజీ ఎడ్సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి, కన్వీనర్ ఆచార్య మృణాళిని తదితరులు విడుదల చేశారు. గత నెల మే 23వ తేదీన నిర్వహించిన ఎడ్ సెట్ కి మొత్తం 29,463 మంది హాజరయ్యారు. ఎడ్ సెట్ పరీక్షలు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అతి త్వరలోనే కౌన్సెలింగ్ కి సంబంధించిన వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించారు.

Spread the love