– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి వినతి
– కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్దీకరణ, ఉద్యోగులు, విద్యారంగం వంటి పలు సమస్యలపై విన్నపం
నవతెలంగాణ-ఖమ్మం
ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు, ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగస్తుల బకాయిలు, ఉద్యోగుల ఓల్డ్ పెన్షన్ విధానం, విద్యా రంగంలో ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ఆదివారం ఖమ్మంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475 నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. తమ్మినేని వీరభద్రం సానుకూలంగా స్పందించి తమ పార్టీ ఆధ్వర్యంలో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయన్ను కలిసిన వారిలో.. సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కుప్పిశెట్టి సురేష్, మానుకోట జిల్లా రాష్ట్ర కౌన్సిలర్ సత్యనారాయణ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి మల్లయ్య తదితరులు ఉన్నారు.