రోడ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట : మంత్రి గంగుల

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలో 14.5 కిలోమీటర్ల పరిధిలో వివిధ కారణాలతో ధ్వంసమైన బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, మంచి నీటి పైపులైన్ల తవ్వకాలతో చాలాచోట్ల బీటీ రోడ్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు. వీటి పునరుద్ధరణ కు ప్రభుత్వం రూ.5.41 లక్షలు మంజూరు చేసిందని వివరించారు. రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు మేచినేని వేచినేని వనజా అశోక్ రావు, నాంపల్లి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు అంజాత్, గౌతమ్ రెడ్డి, ఆర్ అండ్‌ బీ ఈఈ సాంబశివరావు, డి ఈ రవీందర్, ఏ ఈ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love