‘కల్కి’ టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: ప్రభాస్‌ హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవచ్చని పేర్కొంది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love