గురునానక్‌ యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

నవతెలంగాణ-హైదరాబాద్ : గురునానక్‌ వర్సిటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేయాలని యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. గురువారం ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వర్సిటీకి నోటీసులు జారీచేశారు. గురునానక్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తూ గతంలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో వర్సిటీ వర్గాలు విద్యార్థులను చేర్చుకొన్నాయి. గవర్నర్‌ బిల్లును ఆమోదించకపోవడంతో వర్సిటీ ఏర్పాటుకాలేదు. ఇలా ఏడాది గడిచిపోగా, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారికి సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని సూచించింది.

Spread the love