ఖైదీలను విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

నవతెలంగాణ – హైదరాబాద్: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న మొత్తం 231 మంది ఖైదీలను విడుదల కానున్నారు.

Spread the love