ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాద ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

నవతెలంగాణ-హైదరాబాద్‌: ప్రజా జీవితంలో నిత్యం తీరిక లేకుండా గడిపే రాజకీయ నాయకులు సమయం చూసుకోకుండా ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఇదే ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే ప్రమాద ఘటనతో ప్రముఖుల ప్రయాణాలపై చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. సుమోటోగా తీసుకుని ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రవాణాశాఖ ఎక్కడికక్కడ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతిభ లేని డ్రైవర్లను విధుల్లో పెట్టుకోవద్దని మంత్రి సూచించారు.

Spread the love