గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట: ఎమ్మెల్యే

నవతెలంగాణ – అశ్వారావుపేట
పట్టణీకరణ తో సహా గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని అందులో భాగంగానే గ్రామాల్లో అంతర్గత రహదారులు అభివృద్ది,పల్లె పకృతి వనాలు ఏర్పాటు,క్రీడా ప్రాంగణాలు,వైకుంఠధామాలు నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు.రోడ్లు ఏర్పాటు రవాణా సౌకర్యం మెరుగు,పల్లె ప్రకృతి వనాలు తో స్వచ్చమైన గాలి,క్రీడా ప్రాంగణాలు తో క్రీడలు,వ్యాయామం ప్రతీ ఒక్కరికి ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. గురువారం స్థానిక రైతు వేదికలో తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్,ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ రావు ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలు, యువకులకు క్రీడా సామాగ్రి పంపిణీ కి ముఖ్య అతిథిగా ఆయన హాజరు అయి ప్రసంగించారు.
జిల్లా యువజన క్రీడలు అధికారి పరంథామ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల  క్రీడా ప్రాంగణాలు నిర్మించామని,748 క్రీడా ప్రాంగణాలు తో రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాలుగో స్థానంలో ఉందని అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 162 క్రీడా ప్రాంగణాలు తో అశ్వారావుపేట నియోజక వర్గం రెండో స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేసారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు, యువకులకు క్రీడా సామాగ్రి అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి, వైస్ ఎం.పి.పి ఫణీంద్ర,
జెడ్.పి.టి.సి వరలక్ష్మి, స్థానిక సర్పంచ్ నార్లపాటి సుమతి, బీఆర్ఎస్ నాయకులు యుఎస్ ప్రకాశ్ రావు, మందపాటి రాజమోహన్ రెడ్డి, సత్యవరపు సంపూర్ణ లు పాల్గొన్నారు.
Spread the love