నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ విడుదల చేస్తారని ప్రకటించింది. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఇక ఈ ఏడాది దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 4.78 లక్షల మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉంటే.. 4 లక్షలకు పైగా ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ ఉన్నారు. వీరందరూ పరీక్ష ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.