సీఎం మాట తీరు తెలంగాణ గమనిస్తున్నది

Telangana is watching the CM's words– మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫాంహౌజ్‌లు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయి. కూల్చాలా? వద్దా?’ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా ఆమె స్పందించారు. ”రేవంత్‌ రెడ్డి గారు ఆత్మాభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్ముతున్న వ్యక్తిని నేను. మీ ముందు కానీ, ఇంకెవరి ముందు కానీ పేద ఏడుపులు ఏడ్చిన సందర్భం నాకు ఆ దేవుడు కలిగించలేదు. మిమ్మల్ని, మీ మాట తీరును తెలంగాణ సమాజం గమనిస్తున్నది, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి, మిగతా మూడు ఫామ్‌హౌజ్‌లు ఎక్కడున్నాయనే వివరాలు ప్రజల ముందు పెట్టండి. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటా” అంటూ సబితా ఇంద్రారెడ్డి సున్నితంగా హెచ్చరించారు.

Spread the love