తెలంగాణ చలితో గజగజ

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలను వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 7°C నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 వరకు చలి ప్రభావం ఉంటుండగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికి తోడు పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.

Spread the love