– అభివృద్ధి కార్యక్రమాల్లో స్ఫూర్తిదాయకం భూపాలపల్లి
– రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి
– ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం
నవతెలంగాణ-భూపాలపల్లి
76 ఏండ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 సంవత్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించిందని, నేడు స్వరాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ సమైక్య దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాల అమలులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. జిల్లా కేంద్రంలో నూతన వైద్య కళాశాలతోపాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గోరుకొత్తపల్లి మండలంలో నూతన తహసీల్ధార్ కార్యాలయాలు ఇటీవల ప్రారంభించుకొని సేవలందిస్తున్నట్టు చెప్పారు. త్వరలో సమీకత జిల్లా కార్యాలయల భవనాన్ని, ఎస్పి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. భూపాలపల్లి మారుమూల ప్రాంతాన్ని జిల్లా చేసి అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రెయినీ కలెక్టర్ ఉమా శంకర్, ఎస్పీ కరుణాకర్, గ్రంధాలయసంస్థ చైర్మెన్ బుర్ర రమేష్, డీఎస్పీ రాములు, జెడ్పీ వైస్ చైర్‌ఫర్సన్ కళ్ళేపు శోభ రఘుపతి రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సెగ్గెం వెంకటరాణి సిద్దు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.