నవతెలంగాణ – చేర్యాల: గృహ వినియోగం తో పాటు పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జనగామ నియోజకవర్గ కేంద్రం లో సోమవారం నిర్వహించిన విద్యుత్ ఉత్సవాల కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుండి ప్రజా ప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ కరుణాకర్ మాట్లాడుతూ 2014 కు ముందు విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని, విద్యుత్ కోతల వల్ల రైతన్నలు అర్ధరాత్రి అనేక రకాల అవస్థలు పడ్డారని, వ్యవసాయ బావుల వద్ద నిద్రిస్తే పాములు, తేళ్లు కుట్టి మరణించిన సందర్భాలు లేకపోలేదన్నారు. దేశంలో విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తరలి వెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పెడతల ఎల్లారెడ్డి, కొమురవెల్లి దేవస్థానం కమిటీ డైరెక్టర్ సూటిపల్లి బుచ్చిరెడ్డి, సోషల్ మీడియా మండల అధ్యక్షులు తాటికొండ సదానందం, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు అంకుగారి శ్రీధర్ రెడ్డి,పార్టీ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల నర్సయ్య, యూత్ నాలుగు మండలాల ఇంచార్జి శివ గారి అంజయ్య, మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.