తెలంగాణ ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు… అనేకమంది ఆశ్చర్యంగా చూసారు అయినా ఈరోజు దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగాము. హైదరాబాద్ ఐటి రంగానికి ఎంతగానో ఊతం ఇస్తుందనుకున్న ఐటిఐఆర్ ప్రాజెక్టుని కేంద్రం రద్దు చేసినా, ఈ ప్రగతి సాధ్యం అయ్యేలా చూడగలిగాము దీంతోపాటు దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా సంక్షోభం ఆ తర్వాత మారిన పరిస్థితులను కూడా దాటుకొని ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ ఐటి రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో… జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతున్నదిని హైదరాబాద్ నగరాన్ని ఐటి,ఐటి అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగామన్నారు మంత్రి కేటీఆర్.

Spread the love