నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అప్పుల పాలయిందని టిపిసిసి సభ్యులు, మాజీ శాసన సభ్యులు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. జనగామలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 1400 మంది అమరుల ఆత్మ బలిదానానికి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయని నమ్మితే టీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో దళిత ముఖ్యమంత్రి లేడని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, దళిత బంధు అందరికీ లేదని, ఇంటికి ఉద్యోగం, నిరుద్యోగ భతి లేవని, ఉచిత ఎరువులు సరఫరా కావడం లేదని, రైతు రుణమాఫీ లేదని, రైతులకు పంట నష్టపరిహారం అందలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డుల ఊసే లేదని, ఉద్యమకారులకు గౌరవం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లెల సిద్ధారెడ్డి, గంగ%శీ% నరసింహారెడ్డి, దయాకర్ రెడ్డి, బనుక శివరాజ్ యాదవ్, వంగాల మల్లారెడ్డి, కౌన్సిలర్ వంగాల కళ్యాణి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతే శ్రీనివాస్, ఆకుల లక్ష్మయ్య, నాగులపల్లి శ్రీనివాస్, పిట్టల సతీష్, జయ మల్లేశం, బండారు శ్రీనివాస్, కడారు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పొన్నాల ఆధ్వర్యంలో టీపీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు ఆయన కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిసిసి మెంబర్ చెంచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మన్ సానిపల్లి లింగాజీ, పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని కొనియాడుతూ ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా నాయకులు ఉడత రవి, కౌన్సిలర్ రంగాల కళ్యాణి, చటాకోడూరు పిఎసిఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, జక్కుల వేణుమాధవ్, ఓ బి సి రాష్ట్ర నాయకులు మల్లేషు, వేముల మల్లేష్, సుల్తాన్ రెడ్డి, రంగు రవి, పూల సుధాకర్, వేముల రాజు, మోర్తాల ప్రభాకర్, లింగయ్య, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.