తెలంగాణ జీవన దృశ్యం

”ఇప్పుడొక ఊరు కావాలి”
గ్రామీణ నేపథ్యంతో పాటు నిబద్ధత, సజన శీలత, పరిశీలన కలిగిన కవి కొండి మల్లారెడ్డి. మానవ జీవన సంక్షోభంలోని పలు పార్శ్వాలను, విభిన్న కోణాలను తన కవిత్వంలో ప్రతిబింబిస్తున్న కవి. మానవీయ విలువల కోసం పరితపిస్తున్న కవి. మల్లారెడ్డి ఉపాధ్యాయుడు, కవి, రచయిత, కథకుడు, అందమైన చేతిరాత నిపుణుడు, అంతకుమించి భావుకుడు. ఆయన ఇటీవల వెలువరించిన కవితా సంపుటి ”ఇప్పుడొక ఊరు కావాలి”. 38 కవితలతో వెలువడిన ఈ కవితా సంపుటి వర్తమాన జీవన విషాదాన్ని విధ్వంసాన్ని, ప్రపంచీకరణ నీలి నీడలో గ్రామీణ జీవితాన్ని అతలాకుతలం చేసిన తీరును రికార్డు చేసింది. మానవ సంబంధాల కోసం ఆర్తితో తపన పడింది. పల్లెలన్నీ పట్టణీకరణ చెందుతున్న ఈ కాలంలో పల్లె జీవితం పికిలిపోయిన బట్టలా నిస్సారంగా యాంత్రికంగా మారిపోయి పల్లె వాసనలు కోల్పోతున్న సందర్భంలో కవి మదన పడుతున్నాడు.
కొందరి కోసం జరిగే అభివద్ధి నమూనా అని సమర్థవంతంగా తిప్పి కొట్టిన ఆవేదన స్వరం గాలివాన. ప్రపంచీకరణ, సుడో అభివద్ధి పర్యావరణ విద్వంసం సామ్రాజ్యవాద విషపు నీడ గ్రామాల పట్టణీకరణ యాంత్రికత బంధ వియోగం కతిమత్వం ప్రకతి వనరుల కాలుష్యం ఇవన్నీ మనిషిని పీడిస్తూ పల్లెల్ని విధ్వంసం చేస్తున్న సమయంలో కవి కొండి మల్లారెడ్డి ఇప్పుడు ఒక ఊరు కావాలి అని కోరుకోవడంలో బలమైన వేదన కనబడుతుంది.
గ్రామీణ భారతంలో ఊరంటేనే వ్యవసాయం, పొలం, పెట్టుబడి, రాబడి, నష్టం, లాభం, ప్రకతి వైపరీత్యాలు, కాయకష్టం, శ్రమదోపిడి, గిట్టుబాటు ధర లేకపోవడం. ఫలితంగా నిరసన ఉద్యమాలు రైతాంగ పోరాటాలు పాలకుల ఉదాసీనత రైతు ఆగ్రహం నిర్బం ధాలు. ఇందులో మొదటి కవిత ”నాగళ్ళకు నమస్కరిస్తూ”. ఇందులో వేలాది మంది రైతులు ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేసిన ధర్నా నిరసనకు సంబంధించింది. రైతు ఉసురు ఊరకే పోదని హెచ్చరించింది. గుప్పెడు గింజల్ని దోసిట్లోకి తీసుకొని / గుండె నిండా ఊపిరి పీల్చుకుంటున్నా/ పిడికెడు మట్టిని నోసట రాసుకొని / నా గళ్ళకు నమస్కరిస్తున్నా అనే ఎత్తుగడతో ప్రారంభమై జల ఫిరంగుల్ని ముళ్ల కంచెల్ని దాటి నవశకానికి నాంది పలికిన రైతన్నల గుండె బలాన్ని అభినందించిన కవిత.
”తలకెత్తుకున్నందుకు” కవితలో జలాశయాలు, ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రాణానికి ప్రాణమైన ఊరు, పంట పొలాలు, ప్రకతి వనరులు సర్వం కోల్పోతున్న నిర్వాసితుల నిరసన ఆక్రోశం ఆవేదన తాలూకు ప్రతిఘటన ”గుడాటిపల్లి”లో ఎదురయింది. కోల్పోయింది కొండంత/ రాల్చింది ఆవగింజంత/ రేపు కడుపు మసిలిన ఊర్లన్నీ / గుండె చెదరని గుడాటిపల్లి వెనకే అనేది పాలకులకు హెచ్చరికగా మిగులుతుంది. మీకు చేతులెట్లొచ్చే/ ఊరేగింపుల్లో ముందుండి తలకెత్తుకుని / మిమ్మల్ని పీఠం దాకా మోసుకుపోయిన వాళ్ళు అంటాడు.
”డేంజర్‌ బెల్స్‌” కవితలో కార్పొరేట్‌ భూతం వికత రూపం భయపెట్టిన తీరు సమస్త రంగాలను కబలించిన వైనం, ప్రపంచీకరణ విషపరిణామం పరివ్యాప్తమై చుట్టు ముట్టిన తీరు కనబడుతుంది. బకాసురుని ఆకలితో, పచ్చపురుగు ఆకుల్ని నాకేసిన తీరుతో, వేరు పురుగుతో, మిడతలు వాలిన పొలంలో జరిగిన బీభత్సంతో, పోల్చి ఒక వాతావరణాన్ని కవి మల్లారెడ్డి క్రియేట్‌ చేస్తాడు. పండ్ల చెట్లు కూలిపోతాయి /పావురాల రెక్కలు తెగుతాయి/ పక్షులు ఉచ్చుల్లో విలవిల లాడుతాయి/ దూకుతున్న శివంగిలా కాకుండా / పాకుతున్న కొండచిలువలా అనడంలో చాపకింది నీరు లాంటి కార్పోరేట్‌ వ్యాప్తిని అది ధ్వంసం చేసే తీరును వివరిస్తాడు.
ఇందులోని మరో అద్భుతమైన కవిత ”పాండవులగుట్ట”. 30 వేల ఏళ్ల నాటి ఆదిమానవుని ఆదిమ స్థావరం పరిణామ క్రమంలో ప్రకతి మిగిల్చిన సాక్ష్యం ధ్వంసం అవుతున్న ఊరు ఆవాళ్లను ప్రకతి పరిసరాలను, చిత్రాలను, శిలాతోరణాన్ని బండసోరికెల్లని ప్రాకతిక సౌందర్యాన్ని సున్నపురాళ్ల నిక్షేపాలను కొండ చరియలు, వనమూలికలు అక్కడి సంపద ”పాండవుల గుట్ట” ఎక్కుతు న్నప్పుడు అమ్మ పుట్టింటికి చేరుకుంటున్నట్టు కవి అనుభూతి చెందుతాడు.
మోకాలి మంటి బురదలో దేహాన్ని జలగలా సాగ దీసుకున్నా / బట్టాపొట్ట తప్ప బావుకున్నది ఏమీ లేకపోయినా/ చిరునామాకు ఒక ఊరు ఉన్నదని ధీమా/ మన్నులో మన్నైన వాళ్లు ఊర్లు ఖాళీ చేయమన్నప్పుడల్లా ఉరుకుతూనే ఉన్నాం/ ఇక తొవ్వలేదని తెలిశాక మిగిలేది ప్రతిఘటనే / వానపాములా మన్నులో మన్నై ఎడారి పొడుగునా బతుకీడ్చే బడుగు జీవుల జీవన ధైన్యాన్ని ”గాలివాన” కవితలో మల్లారెడ్డి వివరించారు. కొందరి కోసం జరిగే అభివద్ధి నమూనా అని సమర్థవంతంగా తిప్పి కొట్టిన ఆవేదన స్వరం గాలివాన. ప్రపంచీకరణ, సుడో అభివద్ధి పర్యావరణ విద్వంసం సామ్రాజ్యవాద విషపు నీడ గ్రామాల పట్టణీకరణ యాంత్రికత బంధ వియోగం కతిమత్వం ప్రకతి వనరుల కాలుష్యం ఇవన్నీ మనిషిని పీడిస్తూ పల్లెల్ని విధ్వంసం చేస్తున్న సమయంలో కవి కొండి మల్లారెడ్డి ఇప్పుడు ఒక ఊరు కావాలి అని కోరుకోవడంలో బలమైన వేదన కనబడుతుంది. వీరి కవితల్లో అనేక భావ చిత్రాలు దర్శనమి స్తాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు… కసిగా కత్తి దూసిన గాలి/ ఖండ ఖండాలుగా నరుకుతుంది వాన చిలుకుల్ని /నింగి ముఖాన్ని కడిగిన మబ్బులు/ గుత్తులు గుత్తులుగా గూనదారలుగా వేలాడుతు న్నాయి /నదిగా అవతారం ఎత్తాక ఉత్తాన పతనాలు ఉంటాయి /ఉన్మత్తప్రవాహాలు ఉంటాయి /జకమొక రాయి మీద ఎగిసిపడుతున్న నిప్పురవ్వలా/ మౌనానికి భాష ఉంటుంది /అన్నం మెతుకులా మీ ఇంటిల్లిపాది పళ్ళెంలోకి నడిచి వచ్చిన వాళ్ళు బావుకత, అభివద్ధి, శిల్పాల సమన్వయం సంయమనం, వస్తువుకు వొదిగే శిల్పం, కొండి మల్లారెడ్డి కవిత నిర్మాణ రహస్యాలుగా చెప్పవచ్చు
– పప్పుల రాజిరెడ్డి, 6301395519

Spread the love