నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన ఉద్యమకారుడు,తెలంగాణ వాదాన్ని ప్రపంచాన్నికి వినిపించిన మహాజ్ఞాని మండల ఎంపీడీఓ శ్యామ్ సుందర్ అన్నారు. జయశంకర్ సార్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ విక్రమ్ కుమార్, ఎంపీడీఓ సిబ్బంది పాల్గొన్నారు.