నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన ఆ నామినేటెడ్ పోస్టులను రేవంత్‌రెడ్డి సర్కారు భర్తీ చేస్తున్నది. తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ను ప్రభుత్వం నియమించింది. సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డికి ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.