ఇంచియాన్ నగరంలో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రులు

Telangana Ministers visiting Incheon cityనవతెలంగాణ – భువనగిరి
దక్షిణ కోరియాలోని ఇంచియాన్ నగరం లో భాగమైన చియోంగ్న, సాంగడో, యెాన్జజంగ్  మూడు అంతర్జాతీయ స్మార్ట్ సిటీలను  తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులు బుదవారం సందర్శిచారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ..  దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం 2003లో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ స్థాపించబడిందన్నారు. ఫైనాన్స్ టూరిజం వ్యాపారం కోసం ఒక ఐటీబీటీ హబ్ ను నాలెడ్జ్, సర్వీస్ ఇండస్ట్రీని స్థాపించారు. ఇది లాజిస్టిక్స్, టూరిజంపై దృష్టి సారిస్తుందన్నారు.
అంతర్జాతీయ స్మార్ట్  నగరాల వివరాలు..
చియోంగ్న అంతర్జాతీయ నగరంలో సుమారుగా 98.060 జనాభ (36.184 గృహాలు) కలిగి ఉంటారు. ఈ ప్రాజెక్టు వ్యవది 2003 నుండి 2024వరకు , ప్రాజెక్టు ప్రాంతం 17.8 కిలోమీటర్స్, ప్రాజెక్టు అంచనా ఖర్చులు 6.58 ట్రిలియన్లు (0.4లక్షల కోట్లు ) ఉంటుందన్నారు. సాంగడో నగరంలో జనాభా 265,611(104,112గృహాలు ) కలిగి ఉంటారు. ప్రాజెక్టు అంచనా ఖర్చు 21.5  ట్రిలియన్లు, 1.2 లక్షల కోట్లు, ప్రాజెక్టు వ్యవధి 2003 నుండి 2013 వరకు.ఉంటుందన్నారు.  యెాన్జజంగ్  నగరంలో అంచనా జనాభా 179,982( 69 815 గృహాలు ) కలిగి ఉంటారు. ప్రాజెక్టు అంచనా ఖర్చు 13.31  ట్రిలియన్లు (0.8లక్షల కోట్లు ) ప్రాజెక్టు వ్యవధి 2003 నుండి 2027 వరకు, ప్రాజెక్టు ప్రాంతం 51.18 కిలోమీటర్స్.ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డైరెక్టర్ యుంగ్ జే సన్ తో పాటు సభ్యులు కియాన్, చాగిల్ సాంగ్ మరియు అధికారులు పాల్గొన్నారు.
Spread the love