తెలంగాణ ఉద్యమమే ఆయన ఊపిరి

– విద్యార్థి దశ నుండి పోరాటాలు

– చేసిన జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్
– తెలంగాణ ఉద్యమంలో సుమారు 51 కేసులు నమోదు
– జెడ్పీటీసీగా మండల ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రీరామ్ శ్యామ్
నవతెలంగాణ – జమ్మికుంట
జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ మంచి విద్యావేత్త , నిగర్వి , ప్రజా సేవ యే తన లక్ష్యం అంటూ చిన్నప్పటినుండి పేద విద్యార్థులకు, ప్రజలకు తన వంతు సాయం చేసుకుంటూ వస్తున్నారు. గ్రామస్థాయి నుండి యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి లీడర్ గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యం అంటూ వేలాదిమంది విద్యార్థులను ఏకం చేసి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ధర్నాలు, రాష్ట్ర రోకో, నిరసనలో పాల్గొనే విధంగా చేశారు. శ్రీరామ్ శ్యామ్ పై తెలంగాణ ఉద్యమ కాలంలో సుమారు 51 కేసులు నమోదు అయ్యాయి. చాలా సార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. 2001 నుండి తెలంగాణ మలిదశ ఉద్యమంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన ఇంటర్ చదువుతున్న శ్రీరామ్ శ్యామ్ ఆనాడే తెలంగాణ ఉద్యమంలో అతి చురుకుగా పాల్గొన్నారు. అనేక ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయడమే కాకుండా విద్యార్థులకు, ప్రజలకు తెలంగాణ ఏర్పాటు ఎంత ఆవశ్యకమో వివరించారు. 2001లో టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. 2003 నుండి20 06 వరకు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే గెలుపులో ప్రముఖ పాత్ర వహించారు. 2006నుంచి 2007 వరకు టిఆర్ఎస్వి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2006 సంవత్సరంలో కెసిఆర్ ఉప ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గం విద్యార్థులను ఏకం చేసి కెసిఆర్ గెలుపు కోసం కృషి చేశారు. 2008 లో కాకతీయ యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షునిగా పనిచేశారు. 2009 కాకతీయ యూనివర్సిటీ టీఆర్ఎస్వీ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 హుజురాబాద్ సాధారణ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని విద్యార్థులతో కలిసి గ్రామ గ్రామాన వివరించారు. 2009 లో కాకతీయ యూనివర్సిటీ లో జేఏసీ కన్వీనర్ గా ఎన్నికయ్యారు. నవంబర్ 29 కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నవంబర్ 18 జేఏసీ ఏర్పాటు చేసిన విద్యార్థుల సభలో ప్రారంభ ఉపన్యాసం చేశారు. 2009 నవంబర్ 23 అలుగునూర్ క్రాస్ రోడ్డు వద్ద కేసీఆర్ ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలిస్తున్న సందర్భంలో కేయు రెండవ గేటు వద్ద ధర్నా రాస్తారోకో చేసి కేటీఆర్ తో సహా అరెస్టు అయ్యారు.
2010 ఫిబ్రవరి 7న కాకతీయ యూనివర్సిటీలో లక్షలాది మంది విద్యార్థులతో పొలికేక సభకు అధ్యక్షునిగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన తొమ్మిదవ వార్షికోత్సవ సభలో తెలంగాణ అమరులు శ్రీకాంతచారి విగ్రహాన్ని హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునే ఘటనలో డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ తీవ్ర గాయాల పాలయ్యారు. 2010 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు హుజురాబాద్ నియోజకవర్గం లో బస్సు యాత్రకు నాయకత్వం వహించారు. 2010 డిసెంబర్ 16న వరంగల్ లో జరిగిన మహాగర్జనకు హుజురాబాద్ నుండి హనుమకొండకు పాదయాత్ర చేశారు. 2011 నుండి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2012 తెలంగాణ జేఏసీ కమిటీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. 2012 అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రాయినిగూడెంలో అడ్డుకునే సందర్భంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా ,సెల్ టవర్ ఎక్కారు. 2013 విద్యార్థులను ఏకం చేసి తెలంగాణ వాదాన్ని గ్రామ గ్రామాన వినిపించేలా కాలేజీ టు విలేజి ప్రోగ్రాములు నిర్వహించారు. 2013 లో నారా చంద్రబాబు నాయుడుని పాలకుర్తి సభలో అడ్డుకోవడమే కాకుండా గాయాల పాలయ్యారు. 2019లో జమ్మికుంట జడ్పిటిసి గా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొంది ,మండల అభివృద్ధిలో తన వంతు కృషి చేశారు.
Spread the love