రేపు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు..

నవతెలంగాణ-హైదరాబాద్‌: ఎంసెట్‌ ఫలితాలు ఈ నెల 25న(గురువారం) విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌లో మంగళవారం జరిగిన ఎంసెట్‌ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఎంసెట్‌ ఛైర్మన్‌ కట్టా నర్సింహారెడ్డి, కన్వీనర్‌ డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ర్యాంకులను విడుదల చేస్తారని తెలిపారు. ఫలితాలను www.eamcet.tsche.ac.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగిన పరీక్షల్లో ఇంజినీరింగ్‌కు 1,95,275 మంది, అగ్రికల్చర్‌కు 1,06,514 మంది హాజరయ్యారు.

Spread the love